పెళ్లి తరువాత..పెళ్లి ముందు..3

పార్క్ లో…
వాడు ఇందాక కూర్చున్న చోటే ఇంకా కూర్చుని ఉన్నాడు. నేను వాడిని దూరం నుండి అటూ ఇటు తిరుగుతూ చూస్తున్నా. వాడు నన్ను కాస్త భయంగా చూస్తూ ఉన్నాడు. నేను సీరియస్ గా ఫేస్ పెట్టి వాడి ముందు అటూ ఇటూ తిరుగుతూ ఉన్నా. కాసేపటికి వాడు ఏమనుకున్నాడో ఏమో తెలీదు కానీ నా దగ్గరికి మెల్లగా వచ్చాడు. నేను వాడ్ని చూడనట్లుగా తిరుగుతూ ఉన్నా. వాడు నన్ను చూస్తూ రూపా అని పిలిచాడు. నేను పలకలేదు. వాడు నా దారికి అడ్డు వస్తూ నేను చెప్పేది విను అన్నాడు. నేను తలెత్తి వాడి వంక చూసా. వాడు నన్ను కన్విన్స్ చేయడానికి ఎదో చెప్పాలని చూసాడు. అంతే నాకు ఒక్కసారిగా కోపం వచ్చింది. వెంటనే వాడి కాలర్ పట్టుకుంటూ నేనేమైనా పిచ్చిదానిలా కనిపిస్తున్నానారా నీకు ? అన్నా. వాడు ఏమైంది అన్నట్లుగా చూసాడు. నేను కోపంగా వాడి కాలర్ అలాగే పట్టుకుని నీకిస్టం లేకున్నా నిన్ను ప్రేమించి నీ వెంట నన్ను ప్రేమించు నన్ను ప్రేమించు అని పడడానికి నేనేమైనా పిచ్చిదాన్నా అన్నా. వాడు షాక్ గా అలా చూస్తూనే ఉన్నాడు. నేను వాడితో నువ్వు మా నాన్నకో మా అన్నకో లేక ఇంకెవరికో భయపడ్డాను అని చెప్పు అర్దం చేసుకుంటా అంతే కానీ ఉన్న ప్రేమను కూడా లేదు అని చెప్పావో జాగ్రత్తా అని కోపంగా వాడిని తోసేసి అక్కడ నుండి బయటకు వచ్చేశా.

గ్రాడ్యుయేశన్ చేస్తున్న రోజుల్లో..
రూప : నీళ్ళు రావట్లేదూ..
నేను : నేను అప్పుడే చెప్పానా ? విన్నావా నువ్వు ?
రూప : సర్లే, ఇప్పుడేం చేయమంటావో చెప్పు
నేను : నీ ఇంటికెల్లు
రూప : స్నానం మధ్యలో ఉన్నా రా
నేను : అయితే ఎంటి ? టవల్ చుట్టుకొని వెల్లు.
రూప : ఛంపుతా, ముందు వచ్చి ఏమైందో చూడు..
నేను : (విసుగ్గా) నాకు తెలీదు, నేనైతే ముందే చెప్పానా, వాటర్ ప్రాబ్లెమ్ ఉందని, వద్దన్నా వెళ్ళావ్ గా, అనుభవించు