పెళ్లి తరువాత..పెళ్లి ముందు..3

అందుకే నేను ఆ కారణం చెప్పా. కారణం ఒక్కటే చెప్పి నేను రూప తో మాత్రం ఇంకోలా ఎం ఉండడం లేదు తనని కూడా సేమ్ ఒక సిస్టర్ రిలేషన్ తోనే అనుకునే వాడ్ని అలా అని తనని అక్కా అని పిలిచే వాడ్ని కాదు జస్ట్ ఒక ఫీలింగ్ అంతే. నాకు యే రిలేషన్ అనేది ముఖ్యం కాదు తనతో ఉన్నానా లేదా అనేదే ముఖ్యం. అందుకే అలా చెప్పాను. కానీ అది తరువాత రూప అమ్మ భయపడిన విధంగానే మారుతుంది అని అప్పుడు నాకు తెలీదు. నేనేమో తను ఎప్పటికైనా వేరే వాడ్ని పెళ్లి చేసుకుంటుంది, అయినా కూడా నేను తనతో ఇప్పుడు ఉన్నట్లు గానే ఫ్రెండ్లీ గా క్లోస్ గా ఉందాం అని అనుకుంటూ ఉంటే తనేమో అలా ఆలోచించకుండా నన్నే పెళ్లి చేసుకుందాం అని ఆలోచించింది. ఇలా జరిగింది మొత్తం కథ.

పైగా రూప నాన్న పెళ్లి గురించి వాళ్ళ ఫ్రెండ్ కు మాట ఇచ్చిన తరువాత రూప అమ్మ నాతో
రూప అమ్మ : వినయ్ తనకి పెళ్లి కూడా కుదిరింది ఈ టైం లో అయినా నువ్వు తనతో కాస్త చనువుగా ఉండడం ఆపితే బాగుంటుంది నాకు నీ మీద ఎలాంటి చెడు అభిప్రాయం లేదు కానీ ఎంతైనా వేరే వాళ్ళు చూసినప్పుడు అది తప్పుగానే కనిపిస్తుంది అందుకే చెప్తున్నా అర్దం చేసుకో
నేను : ఆంటీ మీరు అంతగా చెప్పాలా, కానీ రూప నే నా మాట వినదు ఆంటీ..
రూప అమ్మ : తన గురించి వదిలేయ్ వినయ్ నువ్వైనా కాస్త జాగ్రత్త గా ఉండు. నేను కూడా తనకి చెప్పడానికి ట్రై చేస్తా. కనీసం ఇద్దరిలో ఎవరో ఒకరు బాగున్నా మంచింది కదా అని నా ఉద్దేశం. అప్పుడంటే ఎదో చిన్న వయసు అని మిమ్మల్ని దూరం పెట్టలేదు. అప్పుడు నేను చేసిన సహాయానికి కృతజ్ఞతగా అయినా ఇప్పుడు మీరు నాకు ఈ సహాయం చేయండి.
నేను : ఎంత మాట ఆంటీ, అప్పుడు మీరు మమ్మల్ని దూరం పెట్టలేదు దానికైనా సరే మేము మీకు కృతజ్ఞతగా ఉంటాం ఇంతగా చెప్పాలా ఆంటీ…
ఇలా రూప అమ్మ నాతో మాట కూడా తీసుకుంది. ఇప్పుడేమో రూప వచ్చి ఐ లవ్ యూ అని అంటుంది. ఎం చెప్పాలి తనకు ?

ప్రస్తుతం పార్క్ లో…
తను కోపంగా పార్క్ నుండి బయటకు వెళ్ళాక ఎం చేయాలో తెలియలేదు నాకు. ఒక పక్క వాళ్ళ నాన్న ఇచ్చిన మాట, ఇంకో పక్క వాళ్ళ అన్న, ఇంకో పక్క నా ఫీలింగ్స్. ఇవ్వన్నీ నన్ను తను కోరుకున్న విధంగా చేయకుండా ఉండేలా చేస్తున్నాయ్. నిజమే నాకు తన మీద ప్రేమ ఉంది కానీ అది ఇంకో రకమైన ప్రేమ అని తనకు తెలియడం లేదు. నేనూ గట్టిగా చెప్పలేను. ఎందుకు అంటే తనంటే నాకు భయం.
ఒకవేళ నేను ఇప్పుడు తన మాట విని తనని ప్రేమించినా వాళ్ళ అమ్మ కు వాళ్ళ అన్న కు ఎం అని సమాధానం ఇస్తాను ? ఒకప్పుడు వాళ్ళు ఇలా భయపడే కదా ఇద్దరినీ కాస్త దూరంగా పెట్టాలి అని చూసింది. కానీ అప్పుడేమో అక్కా తమ్ముడు అని చెప్పి ఇప్పుడేమో లవ్ చేసుకుంటున్నాం అంటే ఎలా ఉంటుంది ?
ఈ విశయం రూప కు ఎలా అర్దం అవుతుంది..