పెళ్లి తరువాత..పెళ్లి ముందు..3

ఏమైనా అంటే నేను పుట్టాక ఇవ్వన్నీ వచ్చాయా ? లేక ఇవ్వన్నీ ఉన్నందుకు నేను పుట్టానా ? అంటుంది.
ఎలా ముందుకు ప్రొసీడ్ కావాలో కూడా అర్దం కావడం లేదు., అలా కాసేపు తిరుగుతూ ఆలోచించు కుంటు చివరికి బయటకు వెళ్లాను. అక్కడ రూప కార్ లో కూర్చుని కనిపించింది. నేను కార్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేశా కానీ అది రాలేదు. తనని చూసి లాక్ తెరువు అన్నా. తను కోపంగా చూసి తల తిప్పుకుంది. నేను తెరువు ప్లీజ్ అన్నా. తను పలకలేదు. నేను డోర్ విండో గట్టిగా కొడుతూ హెలో మేడం చెప్పేది మీకే అని అన్నా.
అంతే తను కోపంగా విండో వంక తిరిగి విండో కొంచెం ఓపెన్ చేసి, నన్ను ప్రేమించని వాళ్లకు నా కార్ లో స్థానం లేదు. ఐ లవ్ యూ చెప్పు తెరుస్తా అని అంటూ మళ్ళీ విండో క్లోస్ చేసి కోపంగా ఫేస్ పెట్టుకుని కూర్చుంది..
నేను కోపంగా తన వంక చూసా. తన నుండి ఎం రెస్పాన్స్ లేదు. కొద్దిసేపు వెయిట్ చేసి చూసా. కానీ నో రెస్పాన్స్. ఇక ఇలా కాదు అని తనతో, నువ్వు ఓపెన్ చేస్తావా ? లేక నన్ను వెల్లిపోమంటావా ? అన్నా. తను అయినా కూడా ఎం పలక లేదు. నేను అటు ఇటు చూసి ఇక కోపంగా కార్ ను ఒకసారి కాలు తో తన్ని అక్కడ నుండి వచ్చేశా. పార్క్ అవతల బస్ స్టాప్ ఉండడం తో అక్కడకు వెళ్ళా. బస్ కోసం వెయిట్ చేస్తున్న నాకు ఒక మెసేజ్ వచ్చింది.
“నువ్వొచ్చి చెప్పేంత వరకు కార్ కదలదు అర్దరాత్రైనా” అని ఉంది దాంట్లో. నేను కోపంగా దూరంగా ఆగి ఉన్న కార్ ను చూసా. అంతలోనే బస్ వచ్చిన సౌండ్ వినిపించింది.