పెళ్లి తరువాత..పెళ్లి ముందు..3

రూప : రేయ్ టైం అవుతుంది రా, నీ సోది వచ్చాక వింటాలే, ముందు ఇక్కడకు వచ్చి ఎదోకటి చెయ్
నేను : (చిరాగ్గా మొబైల్ పక్కన పడేస్తూ బాత్రూం దగ్గరకు వెళ్ళి) సరే తలుపు తెరువు ఏమైందో చూస్తా.
టవల్ తీసి వొంటికి చుట్టుకుంటూ తలుపు తెరిచింది రూప.
తనని కింది నుండి పైకి సీరియస్ గా చూస్తూ లోపలికి అడుగు పెట్టా. తను తలుపు వేసేసింది. నేను వెళ్లి షవర్ దగ్గర ఉన్న రిపేర్ సంగతి చూస్తున్నా. తను వెనుక నుండి త్వరగా అంది. నేను కోపంగా తన వైపు ఒక చూపు చూసా. వెంటనే తను సారీ సారీ అంటూ మెళ్ళగానే చేయి లే అంది. నేను మళ్ళీ పనిలో పడ్డా. రిపేర్ చేయడానికి పది నిమిషాలు పట్టింది. అది అయిపోతూ వుండగా ఒక్కసారిగా బయట నుండి నా రూం లోకి ఎవరో వచ్చిన సౌండ్ వినిపించింది. అది ఎవరై ఉంటారు అని ఊహించే లోపే, రమేష్ గొంతు వినిపించింది. వినయ్ అంటూ..
నేను పని అయిపోవడం తో బాత్రూం లో నుండి బయటకు వెళ్తూ వాడి వంక చూసా. అప్పుడే వాడి వెనుక నుండి రూప వాళ్ళ అమ్మ వస్తూ ఏం వినయ్ రూప ఎక్కడ ? అంది. నేను బాత్రూం నుండి పూర్తిగా బయటకు వచ్చి డోర్ మూసేస్తూ లోపల స్నానం చేస్తుంది ఆంటీ అన్నా. తను అవునా సరే త్వరగా రమ్మను అని కాసువల్ గా అనేసి బయటకు వెళ్తూ అంతలోనే ఎదో డౌటు వచ్చి తిరిగి నా వంక చూసింది. నేను ఏంటి అన్నట్లుగా చూసా. తన అమ్మ డౌటు ఎంటో అర్దం చేసుకున్న రమేష్ వెంటనే నాతో, అది స్నానం చేస్తుంటే నువ్వేం చేస్తున్నావ్ రా లోపల అన్నాడు. నేను మామూలుగానే ఫేస్ పెట్టి నీళ్ళు రావట్లేదు అంటే చూడడానికి వెళ్ళా అని చెప్పా. రూప వాళ్ళ అమ్మ వెంటనే సిగ్గు లేదు అలా ఆడపిల్ల స్నానం చేస్తుంటే వెళ్ళడానికి అంది. నేను నాకెందుకు సిగ్గు తనే పిలిచినప్పుడు అన్నా. తను కొంచెం కోపం నటిస్తూ ఇద్దరికీ మరీ ఎక్కువ చనువు అయిపోయింది రా వెంటనే ఎదో ఒకటి చేయాలి లేకపోతే హద్దు మీరేలా ఉన్నారు అంది. ఇదంతా లోపల నుండి వింటున్న రూప కోపంగా నీళ్ళు రావట్లేదు అంటే వచ్చాడు లే మా, దీనికే సీన్ క్రియేట్ చేయకు అంది. దానికి వెంటనే రూప అమ్మ, ముందు నీకు ఎక్కువైందే, ఆడపిల్లలా ఎలా ఉండాలో కూడా తెలియట్లేదు నీకు, అయినా మనింట్లో స్నానం చేయకుండా ఇక్కడకెందుకు వచ్చావే అంది. దానికి రూప ఎదో చెప్పబోతు ఉండగా అప్పుడే మా అమ్మ బయట నుండి వస్తూ ఏమే ఇక్కడ ఏం చేస్తున్నావ్ త్వరగా రా పని ఉంది అని అంటూ లోపలికి వచ్చింది. రూప అమ్మ నా వంక ఒకసారి చూసి మళ్ళీ మామూలుగా మా అమ్మ తో పద వస్తున్నా అంటూ బయటకు వెళ్ళింది. రమేష్ గాడు నా వంక చూసాడు. నేను స్మైల్ ఇచ్చా, వాడు ఏం మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయాడు.
ఇవ్వాళ వాడి బర్త్ డే.