పెళ్లి తరువాత..పెళ్లి ముందు..3

ఇంట్లో గ్రాండ్ గా పార్టీ ఆరెంజ్ చేశారు. సాయంత్రం అవుతూ ఉండగా రమేష్ బర్త్ డే పార్టీ కి వాడి ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వచ్చారు. పార్టీ గ్రాండ్ గా జరుగుతూ ఉంది. ఎప్పటి లాగే నేనూ రూప ఇద్దరం ఒకరిని ఒకరం విడిచి పెట్టకుండా తిరుగుతూ ఉన్నాం. అలా మేము తిరుగుతూ ఉన్నది దూరం నుండి రమేష్ ఫ్రెండ్ ఒకడు గమనిస్తూ ఉన్నాడు., వాడు మమ్మల్ని గమనించడం ఇది మొదటి సారి ఏం కాదు, ఎప్పటి నుండో మమ్మల్ని ఇలాగే గమనిస్తూ ఉన్నాడు. వాడి గురించి చెప్పాలంటే వాడికి రూప అంటే చాలా ఇష్టం, నేను రూప తో తిరగడం, రూప తో క్లోస్ గా ఉండడం వాడికి అస్సలు నచ్చదు. అందుకే వాడ్ని నేను ఎప్పుడు చూసినా నా వంక కోపంగా చూస్తూ కనిపిస్తాడు. నన్ను ఎప్పుడెప్పుడు పక్కకు తప్పించాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ రూప వైపు నుండి నాకు బలమైన సపోర్ట్ ఉండడం వల్ల వాడు నన్ను ఏం చేయలేక పోతున్నాడు. కానీ నేను ఎప్పుడెప్పుడు దొరుకుతానా అని మాత్రం కళ్ళలో వొత్తులు వేసుకుని మరీ చూస్తూనే ఉంటాడు. వాడు అలా నా గురించి ఆలోచిస్తున్నాడు అని నాకు అప్పుడు తెలీదు. అందుకే ఆ పార్టీ లో ఎప్పటి లాగే రూప తో ఎలా ఉంటానో అలా ఉన్నా
రమేష్ గాడికి వాడు ఒక రకంగా మంచి ఫ్రెండ్ అనే చెప్పాలి, వాడి మాట కచ్చితంగా రమేష్ గాడు వినే తీరతాడు అలాంటి ఫ్రెండ్షిప్ వాళ్ళది. అంత మంచి ఫ్రెండ్షిప్ ను వాడు తన లవ్ సక్సెస్ చేసుకోవడానికి యువుస్ చేసుకుంటాడు అని నాకు అప్పుడు తెలీదు. నేను ఇంకా రూప ఇద్దరం రాసుకుని పూసుకుని తిరుగుతూ ఉండడం చూపిస్తూ వాడు అనుకున్నది చెప్పడం మొదలు పెట్టాడు రమేష్ కు. నేను రూప ను లవ్ చేస్తున్నా అని, అమాయకమైన రూప ను బుట్టలో వేసుకుంటున్నా అని, ఎవ్వరూ లేనప్పుడు తనని ఫిజికల్ గా కూడా టచ్ చేస్తున్నా అని, ఇంకా ఛాన్స్ ఇస్తే ఇది చాలా దూరం వెళ్తుంది అని, ఇలా ఏవేవో చెప్పేశాడు. అలా చెప్పి అంతవరకు నా మీద పెద్దగా అనుమానం లేని రమేష్ గాడికి నామీద డౌటు కలిగేలా చేసాడు. పైగా రూప తో నేను క్లోజ్ గా ఉండడం ఇంకా పొద్దున బాత్రూం లో ఇద్దరం ఒకేసారి ఉండడం వంటివి చూడడం తో వాడికి నా మీద డౌటు రావడానికి పెద్దగా టైం కూడా పట్టలేదు..