పెళ్లి తరువాత..పెళ్లి ముందు..3

మనసు వేగంగా ఆలోచిస్తూ ఉంది. ఏదేదో ఆలోచనలు వస్తూ ఉన్నాయ్. కానీ ఏదీ అంత స్ట్రాంగ్ గా లేదు. త్వర త్వరగా ఆలోచిస్తూ ఎం చెప్పాలా అని అనుకుంటూ ఉండగా ఒక ఐడియా తట్టింది. అంతే వెంటనే తలెత్తి రూప అమ్మ వంక చూసా. తను ఏమైనా చెప్పాలా అన్నట్లుగా చూసింది. నేను ఒక్కసారిగా ఆలోచించా. తనకు డైరెక్ట్ గా ఎం చెప్పినా కూడా తను విన్నట్లే విని మళ్ళీ నన్ను డైవర్ట్ చేయాలి అనే చూస్తుంది అలాంటప్పుడు చెప్పినా వేస్ట్ కదా అని అనిపించి వెంటనే తనను వేరే విధంగా అప్రోచ్ అవుదాం అని అనిపించింది.
ఒకసారి నాకూ రూప కు మధ్య జరిగినవి అన్నీ గుర్తు తెచ్చుకున్నా తనని ఎం జరిగినా వోడులుకోకూడదు అని ఒకసారి గట్టిగా అనుకుని రూప అమ్మ వంక చూసా.
తను నేను ఎం చెప్తానా అని చూస్తూ ఉంది. తనలా ఎం చెప్తానా అని చూస్తూ ఉండడం చూసి నేనే కావాలని పైకి లేస్తూ నా రూం వైపు నడిచా. నేను అలా చేయడం చూసి నేనేదో చెప్తా అని ఎక్స్పెక్ట్ చేసిన మా అమ్మ రమేష్ ఇంకా రూప అమ్మ ముగ్గురు నేనలా సైలెంట్ గా వెళ్ళడం చూసి విచిత్రంగా చూసారు. నేను మౌనంగా నా రూం వైపుకు కదిలా. నేను అనుకున్నట్లు గానే రూప అమ్మ గొంతు పెగిలింది. వినయ్ అంటూ..
నేను మనసులో నవ్వుకున్నా.
రూప అమ్మ : ఏమైంది ?
నేను : ఎం లేదు లే ఆంటీ
రూప అమ్మ : మరి ఎందుకు అలా వెళ్ళిపోతున్నావ్ ?
నేను : ఎం లేదులే ఆంటీ
రూప అమ్మ (నా దగ్గరికి వస్తూ) : చెప్పు రా ఏమైంది ?
ఏమైనా చెప్పాలి అని అనుకుంటున్నావా ? చెప్పు పర్లేదు
నేను : లేదు లే ఆంటీ, నేనేమ్ చెప్పలేను,
ముఖ్యంగా మీకు అయితే అస్సలు చెప్పలేను అన్నా
(రూప అమ్మ అర్దం కానట్లు చూసింది)
నేను అది చూసి మీకు కావలసినట్టు గానే చేసుకోండి ఆంటీ మీ ఇష్టం నేనేం అడ్డు చెప్పను అంటూ మళ్ళీ రూం దగ్గరికి వెళ్ళా వెళ్తున్న నన్ను అర్దం కానట్లు గా చూస్తూ వచ్చి ఆపింది. ఆపి నన్ను చూసి అసలు ఏమైంది చెప్పు అంది. నేను మనసులో ప్లాన్ వర్కవుట్ అవుతుంది లే అని అనుకుంటూ తనని చూసి ఇద్దరు ఆడ మగ కలిసి ఉంటే తప్పుగా అర్ధం చేసుకోవడం కంటే గొప్పగా ఆలోచించ లేని మీకు నేను ఎం చెప్పగలను లే ఆంటీ నన్ను క్షమించండి అంటూ పక్కనే ఉన్న రమేష్ గాడి వంక కూడా చూసి సారీ రమేష్ మీ చెల్లి తో అలా ఉన్నందుకు అంటూ ఇద్దరి వంక చూసి ఇకపై మీరు చెప్పినట్లు గానే రూప తో దూరంగా ఉంటాను అంటూ వాళ్ళ రియాక్షన్ పట్టించు కోకుండా నా రూం లోకి వచ్చేశా.