పెళ్లి తరువాత..పెళ్లి ముందు..3

రూప అమ్మ, రమేష్ ఇంకా మా అమ్మ ముగ్గురు ఒకరినొకరు ఎం అర్దం కానట్లుగా చూసుకున్నారు. కాసేపు అయ్యాక నా రూం తలుపు తెరుచుకుంది. రూప అమ్మ, మా అమ్మ రమేష్ ఇంకా మా అక్క మొత్తం నలుగురు లోపలికి వచ్చారు. నేను ఇటు వైపుకు తిరిగి కూర్చున్నా. రూప అమ్మ నా దగ్గరికి వస్తున్న శబ్దం వచ్చింది. తను నన్ను కన్విన్స్ చేయడానికి వస్తున్నట్లుగా అనిపించింది ఎందుకో సడెన్ గా భయం వేసింది. ఒకవేళ నేను అనుకున్నట్లు కాకుండా రూప ను నిజంగానే తన అమ్మ దూరం చేస్తుందా అని అనిపించింది. ఎందుకో రూప అమ్మ ను చూడలేక పోయాను భయం వేసింది. తల తిప్పేసుకుని గట్టిగా కళ్ళు మూసుకున్నా. మనసులో ఒకటే నడుస్తుంది ఒకవేల రూప ను నిజంగా నా నుండి దూరం చేస్తుందా ? అని. ఎందుకు అంటే రూప కూడా చాలా సార్లు చెప్పింది. నన్ను నిన్ను మా అమ్మ దూరం చేస్తుంది అని ఇంకా తనని హాస్టల్ కు కూడా పంపించాలని చూస్తుంది అని. అదే భయం నాకు మొదలు అయ్యింది. ఒకవేళ అలా చేస్తే రూప ను ఇకపై రోజూ చూడలేను. తనతో ఎప్పటిలా గొడవ పడలేను. తనతో చనువుగా తిరగలేను, తన కేరింగ్ ఇంకా లవ్ రెండూ దూరం అవుతాయి. అలా జరిగితే నేను ఉండగలనా అని అనిపించింది. తను లేకుండా ఎలా ఉండాలి ఎలా ఉండాలి అని మనసు పడే పదే అంటూ ఉండగా ఒక్కసారిగా ఆ భయానికి కళ్ళలో నీళ్ళు వచ్చాయి. అలా ఊహించని విధంగా కళ్ళలో నీళ్ళు రావడం తో రూప అమ్మకు కనిపించకూడదు అని వెంటనే పక్కకు జరగాలి అని చూసా. కానీ అంతలోనే రూప అమ్మ నా పక్కన వచ్చి కూర్చుని వినయ్ ఇటు చూడు అంది. నేను తల పక్కకు తిప్పుకున్నా నేను ఏడుస్తుంది కనిపించ కూడదు అని. కానీ రూప అమ్మ నా తల నిమురుతూ వినయ్ అంటూ మళ్ళీ పిలిచింది. నేనేం పలకలేదు. తను నా ముఖాన్ని కొంచెం కిందికి వంగి చూస్తూ ఎన్టీ ఏడుస్తున్నావా అంది నవ్వుతూ. అంతే వెంటనే నేను ఏడుస్తుంది తనకు కనిపించ కుండా తల పక్కకు తిప్పుకుంటూ ఇంకొంచెం పక్కకు జరిగా. నేను అలా జరగగానే తను కూడా నా పక్కకు వస్తూ ఎన్టీ రా దీనికే ఏడుస్తున్నావా ? అసలు ఏం అంత జరిగిందని ఏడుస్తున్నావు ? అంటూ నన్ను దగ్గరికి తీసుకుంది. తనలా తీసుకోగానే ఒక్కసారిగా ఏడుపు తన్నుకొచ్చింది. (అప్పుడు పిల్లోడిని కదా కొంచెం భయం వేసింది రూప ఎక్కడ దూరం అవుతుందో అని అందుకే ఆ ఏడుపు) నేనలా ఒక్కసారిగా ఏడ్చే సరికి తను హయ్యో ఏంటయ్యా ఇది అంటూ నవ్వడం మొదలెట్టింది. తనలా నవ్వుతుంటే నాకు కోపం వచ్చింది కోపంగా తన వంక చూసి తన బుజాల మీద గట్టిగా పిడికిలి తో గుద్దుతూ రాక్షసి రాక్షసి అని అన్నా. నేనలా కొడుతుంటే తనకి నా ప్రవర్తన ముద్దొచ్చి నన్ను చూస్తూ నేను అలా కొడుతూ వుండగానే నన్ను దగ్గరికి తీసుకుని వాటేసుకుంది. నేను తనని విడిపించు కోవాలని చూసా. కానీ తను నన్ను గట్టిగా వాటేసుకుని నా చెంప మీద ముద్దు పెట్టుకుంది. నేను చాలా సేపు విడిపించు కోవడానికి చూసా. కానీ తను నన్ను వదలలేదు. కాసేపటికి సైలెంట్ అయిపోయాను.
తను చిన్నగా నా వీపు తడుతూ మెల్లగా నాకు మీ ఇద్దరినీ దూరం చేయాలని లేదు రా, ఇంకా మీరిద్దరూ అలా కలిసి ఉంటేనే నాకు ఇష్టం కానీ అది హద్దు దాటుతుంది ఏమో అని చిన్న భయం అంతే అందుకే అలా చెప్పా అంది. నేను ఎం పలక కుండా ఉండిపోయాను. తను నన్ను తన కౌగిలి నుండి వేరు చేసి నా ముఖం లోకి చూసింది. నేను తల దించుకుని ఉన్నా. తను నన్ను చూసి మగాళ్లు ఎడ్వకూడదు తెలుసా అంది. నేను తల తిప్పుకున్నా. తను నా చేతిని తన చేతిలోకి తీసుకుంటూ ఎందుకు రా అది అంటే నీకు అంత ఇష్టం అని అంది. నేను ఎం అనలేదు. తను ఇక నన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సరే పో ముందు పోయి ముఖం కడుక్కుని రాపో అని అంది. నేను కదలలేదు, కొంచెం సిగ్గు వేసింది. మొత్తం నలుగురి ముందు సిగ్గు లేకుండా ఎడ్చా కదా వాళ్ళ ముందు కదలాలి అంటే సిగ్గనిపించింది. వెంటనే మా అమ్మ నా దగ్గరికి వస్తూ నన్ను లేపింది. లేపి పద ముఖం కడుక్కో అంటూ నన్ను బాత్రూం దగ్గరికి తీసుకు వెళ్ళింది. నేను బాత్రూం లోకి వెళ్లి ముఖం కడుక్కున్నా. బయట మా అమ్మ ఇంకా రూప అమ్మ మాటలు వినిపించాయి.