పెళ్లి తరువాత..పెళ్లి ముందు..3

మా అమ్మ ఎందుకే వాడ్ని అలా ఏడిపించావ్ అని అంటూ ఉంటే రూప అమ్మ నాకేం తెలుసే మీ వాడు అంత సెన్సిటివ్ అని అంటూ నవ్వింది. మా అమ్మ దానికి పోనీలే ఇక వాడితో అలా అనకు అంటూ ఇంకేదో మాట్లాడుతూ ఉండగా నేను తలుపు తెరిచాను. వాళ్ళని చూడాలి అంటే సిగ్గు వేసింది. అందుకే తల వంచుకుని బయటకు వెళ్తుంటే రూప అమ్మ నన్ను దగ్గరికి లాక్కుంది. అలా లాక్కుంటూ మా అమ్మ ను చూసి నాకు ఇప్పుడు అర్దం అయ్యిందే, దానికి ఎందుకు వీడంటే అంత ఇష్టమో అని అంటూ నా ముఖం లోకి చూసి వీడిలా సెన్సిటివ్ గా ఉండేవాళ్ళు అంటే దానికి మహా ఇష్టం అందుకే వీడంటే దానికి అంత ఇష్టం అంటూ మా అమ్మ ను చూసి కన్ను కొడుతూ అప్పుడేగా ఈసీ గా కంట్రోల్ చేయచ్చు అంది నవ్వుతూ..
అలా అని మళ్ళీ తిరిగి నన్ను చూస్తూ అయినా ఏంట్రా మగాడివే నా నువ్వు, అస్సలు సిగ్గు లేకుండా అలా ఏడుస్తారా ఎవరైనా అంది, అలా అంటూ నన్ను తన పక్కన కూర్చో పెట్టుకుంది. నాకు ఇంకో వైపు మా అమ్మ కూర్చుంది. మా అక్క ఇంకా రమేష్ గాడు ఇద్దరూ నన్నే చూస్తున్నారు. నేను తల దించుకుని ఉన్నా. రూప అమ్మ నన్ను చూస్తూ ఏమైంది రా నీకు అంత చిన్న విశయానికే ఎడుస్తారా ఎవరైనా అంది. నేను తన వంక తలెత్తి చూస్తూ నీకు చిన్న విషయమే ఆంటీ కానీ నాకు కాదు రూప అంటే నాకిష్టం అన్నా. తను నవ్వుతూ మరీ అంత ఇష్టమా అంది. నేను హ్మ్మ్ అన్నా. తను ఎందుకు రా అలా అంది. నేను మళ్ళీ వేరేలా చెప్తే తను ఇంకేదో లా అనుకుంటుదేమో అని భయం వేసి వెంటనే తనంటే నాకు ఇష్టం ఆంటీ, ఎందుకో తెలీదు, తను నన్ను కేర్ చేసే విధానం తను నన్ను ప్రేమగా చూసుకునే విధానం తను నాతో గొడవ పడే విధానం ఇంకా చెప్పాలంటే తను నన్ను ఒక తమ్ముడిలా ట్రీట్ చేసే విధానం అంటే నాకు చాలా ఇష్టం, తను చివరికి నన్ను కొట్టినా కూడా నాకు చాలా ప్రేమ గా అనిపిస్తుంది ఆంటీ అన్నా..
కావాలనే తమ్ముడిలా అనే పదం వాడాను. ఎందుకు అంటే మళ్ళీ నా కిష్టం అని అన్నందుకు తను వేరేలా అర్దం చేసుకుంటుంది ఏమో అని భయం వేసింది పైగా రమేష్ గాడికి కూడా డౌట్ వస్తుంది ఏమో అని అలా చెప్పా. నాకింకో ఫీలింగ్ లేనప్పుడు అక్కా అని చెప్పడానికి నాకేం సమస్య ? అందుకే అలా అన్నా పైగా చెప్పడం వరకే కాదు నిజానికి నాకు కూడా తన మీద వేరే లా ఎం అభిప్రాయం లేదు. తను చూపించే ప్రేమ కేర్ అంటే నాకు చాలా ఇష్టం. పైగా తనేమో నాకంటే పెద్దది కాబట్టి తమ్ముడి లా అని చెప్తే ఇక యే గొడవా ఉండదు లే అని అనిపించింది. అందుకే వెంటనే అదే చెప్పేశా.
“తను నాకు అక్క లాగా ఉంటుంది, నన్ను చాలా ప్రేమగా చూసుకుంటుంది అందుకే నాకు ఇష్టం అంటూ ప్లీజ్ ఆంటీ దయచేసి తనని హాస్టల్ కు పంపించకండి, తను లేకుండా నేను ఉండలేను అని అన్నా.
నేను ప్రేమ ఇంకా ఇష్టం అనే పదాలు యుస్ చేసినా కూడా అక్క ఇంకా తమ్ముడు అనే పదాలు యూస్ చేయడం తో వాళ్ళు కామ్ అయిపోయారు. నా మీద అంత వరకు ఉన్న ఒపీనియన్స్ పోయి ఇంకో రకమైన ఒపీనియన్స్ వచ్చాయి వాళ్లకు. ముఖ్యంగా రమేష్ గాడికి ఇంకా రూప అమ్మ కు.
నేను అక్కా అన్నాక కూడా వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు అని నేను అనుకోలేదు అందుకే అలా చెప్పా. వాళ్ళు కూడా నేను అలా అనేసరికి ఇంకేం అనలేక పోయారు. అప్పటి నుండి వాళ్ళు నన్ను ఇంకా రూప ను అక్కా తమ్ముడు లాగే చూసారు. మేమెంత క్లోజ్ గా ఉన్నా కూడా పెద్దగా పట్టించు కోలేదు. రమేష్ కూడా తరువాత నుండి పెద్దగా మమ్మల్ని పట్టించు కోలేదు అందుకే నాకు అప్పుడు తీసుకున్న నిర్ణయం తప్పు అనిపించలేదు. ఎందుకు అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ లో రూప నాకు దగ్గరగా ఉండడం మాత్రమే నాకు కావాలి అది ఎలాంటి రెలేషన్ తో ఉందో నాకు అనోసరం కానీ నాతోనే ఉండాలి అదే నాకు ముఖ్యం.