రాములు ఆటోగ్రాఫ్ – Part 1

రాము తన సూట్ కేస్ లో నాలుగు జతల బట్టలు ఇంకా కావలసినవి సర్దుకుని airport కి వెళ్ళాడు.
Airport కి వెళ్ళిన రాము లోపలికి వెళ్ళి సెక్యూరిటీ ఫార్మాలిటీస్ పూర్తి అయిన తరువాత్ ముంబయ్ వెళ్ళే ఫ్లైట్ కోసం విజిటర్స్ గ్యాలరీలో కూర్చి ఎదురుచూస్తున్నాడు.

అలా కూర్చున్న రాముకి తన బ్యాగ్ లో ఉన్న అల్చమ్ తీసుకుని అందులో ఫోటోలు చూస్తూ, రేణుక తనకు ఇచ్చిన అడ్రస్ ని ఒకసారి చూసికున్నాడు.

అలా ఫ్యామిలీ ఆల్బమ్ చూస్తున్న రాముకి గతం మొత్తం ఒక్కసారిగా గిర్రున తిరిగింది….తన జీవితంలో తాను ఇంతలా కనీవినీ ఎరుగని ఊహించని మార్పులు జరుగుతాయని అసలు ఊహించలేదు….తన జీవితంలో జరిగిన సంఘటనలు కూడా ఎవరికైనా చెబితే నమ్మేట్టుగా కూడా లేవు….అంతెందుకు ఒక్కోసారి గతం మొత్తం గుర్తుకొచ్చినప్పుడల్లా ఒక కలలాగ అనిపించేది.

ఆల్బమ్ లో ఉన్న ఫోటోలు చూస్తూ ఆ ఫోటోల్లో ఉన్న వాళ్ళ మొహం మీద చేతి వేళ్ళతో తాకుతూ నిజంగానే తాను వాళ్ళను తాకినట్టు అనిపించగానే రాము కళ్ళల్లో ఒక్కసారిగా అతనికి తెలియకుండానే రెండు కన్నీటి చుక్కలు రాలి ఆల్బమ్ మీద పడ్డాయి.

అది చూసి రాము వెంటనే తన కన్నీళ్ళను తుడుచుకుని ఆల్చమ్ లోపల పెట్టేసి తాను కూర్చున్న చైర్ లో వెనక్కి ఆనుకుని కళ్ళు మూసుకుని, “ఇప్పుడు వీళ్ళు నన్ను చూస్తే ఎలా ఫీలయితారు…..నేను వస్తున్నట్టు కూడా ఎవరికీ చెప్పలేదు….నన్ను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లా అంగీకరిస్తారా…..అసలు నన్ను చూసి నమ్ముతారా…..” అని తన మనసు నిండా చెప్పలేనన్ని ఆలోచనలు ముసురుకుంటుండగా కళ్ళు మూసుకుని అలాగే కూర్చున్నాడు.

అలా ఎంత సేపు కూర్చున్నాడో తెలియదు కాని తనను ఎవరో తట్టిలేపినట్టు అనిపిస్తే కళ్ళు తెరిచి చూసాడు.

ఎదురుగా ఎయిర్ హోస్టెస్ అతని వైపు చూసి నవ్వుతూ, “సార్….మీరు ముంబయ్ ఫ్లైట్ కి వెళ్ళాలి కదా….” అనడిగింది.

రాము ఆమె వైపు చూసి చిన్నగా నవ్వుతూ అవునన్నట్టు తల ఊపాడు.

“అయితే అనౌన్స్ మెంట్ అయింది సార్…..మీరు చెక్ ఇన్ అవొచ్చు…..” అంటూ వినయంగా చెప్పింది.

రాము ఆమె వైపు చూసి, “చాలా థాంక్స్ మేడమ్,” అని సూట్ కేస్, బ్యాగ్ తీసుకుని బయలుదేరి….అక్కడ లగేజ్ కౌంటర్ లో తన సూట్ కేస్, బ్యాగ్ ఇచ్చి తను ఫ్లైట్ లోకి ఎక్కి తన సీట్లో కూర్చుని తన వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఎలా జరుగుతుందో….తన వాళ్ళు తనని ఎలా రిసీవ్ చేసుకుంటారో అని అనుకుంటూ తన వాచీలో టైం చూసుకున్నాడు.

టైం ఉదయం 11 అయింది….అలా కూర్చున్న రాము దగ్గరకు ఒక ఎయిర్ హోస్టెస్ వచ్చి డ్రింక్స్ ఇచ్చింది.

రాము ఆమె చేతిలో డ్రింక్ తీసుకుంటూ, “ముంబయ్ ఎన్నింటికి చేరుకుంటుంది…..” అనడిగాడు.

“సార్….రెండు గంటలు పడుతుంది,” అన్నది ఎయిర్ హోస్టెస్.

“చాలా థాంక్స్,” అని అన్నాడు రాము.

దానికి ఎయిర్ హోస్టెస్ చిన్నగా నవ్వుతూ వెళ్ళిపోయింది.

అలా ట్రావెల్ చేస్తున్న రాము సుమారు మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో ముంబయ్ లో ఫ్లైట్ దిగాడు.

లగేజ్ తీసుకుని ఎయిర్ పోర్ట్ నుండి బయటకు వచ్చి క్యాబ్ ని ఆపి లోపల కూర్చున్నాడు.

క్యాబ్ డ్రైవర్ : సార్…..ఎక్కడకు వెళ్ళమంటారు….

రాము : Grand Hayatt Hotal కి పోనివ్వు…..

క్యాబ్ డ్రైవర్ : అలాగే సార్…..

అంటూ కార్ స్టార్ట్ చేసి రాము చెప్పిన 5 స్టార్ హోటల్ వైపు పోనిచ్చాడు.

పావుగంటకు రాము ఎక్కిన క్యాబ్ Grand Hayatt ముందు ఆగింది.

రాము అతనికి డబ్బులు ఇచ్చి….కారు దిగాడు….అంతలో హోటల్ బెల్ బాయ్ వచ్చి రాముకి విష్ చేసి అతని లగేజీ తీసుకుని లోపలికి వచ్చాడు.