రాములు ఆటోగ్రాఫ్ – Part 26

రాము : అబ్బా….ఏంటి విసిగించకుండా చెప్పు….(అంటూ కొద్దిగా విసుక్కున్నాడు.)
అనిత : అదిగో విసుక్కుంటున్నావు…అయితే నేను చెప్పనులే…..(అంటూ మూతి ముడుచుకున్నది.)
రాము : సరే…సరే….విసుక్కోనులే ఇంతకూ విషయం ఏంటో చెప్పు…..
అనిత : సరె….నేను అడిగిన దానికి నిజం చెప్పాలి….(అంటూ తన చేతిని రాము ముందు పెట్టి) అలా అని నాకు ఒట్టు వేయి….
రాము : అబ్బో….ఇన్ని కండీషన్లు పెడుతున్నావంటె….విషయం చాలా పెద్దదే….అయినా నా మీద నీకు నమ్మకం లేదా….
అనిత : నమ్మకం ఉన్నది….కానీ….
రాము : నమ్మకం ఉన్నప్పుడు ఇక ఒట్టు వేయాల్సిన అవసరం ఉన్నదా…..
అనిత : ఏదో నా తృప్తి కోసం…..
రాము : అయినా నీతో పరిచయం అయిన దగ్గర నుండీ నీకు ఎప్పుడూ నేను అబధ్ధం చెప్పలేదు….ఏదైనా ఓపెన్‍గానే ఉన్నాను….
అనిత : కాని ఒక్క విషయం మాత్రం నాతో ఇంకా చెప్పలేదు అనిపిస్తున్నది…..
రాము : నీ దగ్గర ఏం దాచలేదు…..
అనిత : దాచకపోతే….నేను అడిగే విషయం కూడా ఓపెన్‍గా చెప్పు…..
రాము : ముందు విషయం చెప్పు….అది నీ దగ్గర దాచానా లేదో అప్పుడు నాకు అర్ధమవుతుంది….
అనిత : అదే నా మొగుడు భాస్కర్ విషయం….
రాము : భాస్కర్‍కి ఏమయింది….(అంటూ అనిత వైపు అనుమానంగా చూసాడు.)
అనిత : నువ్వు నాకు పరిచయం అయిన దగ్గర నుండీ నిన్ను గమనిస్తున్నా రామూ….నీకు అమ్మయిల ఒక్క బలహీనత తప్పితే నువ్వు చాలా మంచివాడివి….చదువుకుంటూనే బాగా సంపాదిస్తున్నావు….అడిగిన వాళ్ళకు నీకు చేతనైనంత సహాయం చేస్తున్నావు…..ప్రతి ఒక్కరితో అంటే నీ స్థాయికి తక్కువ అయిన వాళ్ళతో కూడా చాలా ఫ్రండ్లీగా నవ్వుతూ మాట్లాడుతున్నావు….కాని ఒక్క నా మొగుడు భాస్కర్ విషయంలో మాత్రం నీ పద్దతి నాకు అర్ధం కావడం లేదు….
రాము : ఏమర్ధం కాలేదు నీకు….(అంటూ నవ్వాడు.)
అనిత : నువ్వు తల్చుకుంటే నా మొగుడిని ఏదైనా ఆశ్రమంలో చేర్చి…పిల్లలను అనాధాశ్రమంలో చేర్చి నన్ను లొంగదీసుకునే శక్తి నీకు ఉన్నది….కాని అలా చేయకుండా నా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ….నాకు నచ్చినట్టు ఉంటూ…నా ఇష్టాలు తీరుస్తున్నావు….కాని భాస్కర్‍తో మాత్రం చాలా హర్ష్‍గా ఉంటున్నావు…..ప్రతి ఒక్కళ్లతో మృదువుగా మాట్లాడే నువ్వు నా మొగుడితో అంత రూడ్‍గా ఎందుకుంటున్నావో నాకు అర్ధం కావడం లేదు…
రాము : అయినా నీకు ఇప్పుడు ఎందుకు అనుమానం వచ్చింది….

అనిత : నేను ఆయన భార్యని రామూ….ఏ భార్య అయినా తన కళ్ల ముందే తన భర్తకు అవమానం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేదు….
రాము : కాని నాకు నీ మొగుడి మీద ఏ కోపం లేదు అనితా….(అంటూ బెడ్ మీద నుండి దిగి కిటికీ దగ్గరకు వెళ్ళి బయటకు చూస్తున్నాడు.)
రాము అలా డల్‍గా ఉండే సరికి తన నుండి రాము ఏదో దాస్తున్నాడని అర్ధమయి అనిత కూడా బెడ్ మీద నుండి దిగి వార్డ్‍రోబ్‍లో నైటీ తీసుకుని వేసుకుని రాము దగ్గరకు వచ్చి భుజం మీద చెయ్యి వేసి, “రామూ….నువ్వు ఏదో కారణం చేత భాస్కర్‍తో అలా ఉంటున్నావని నాకు అర్ధం అయింది….ప్లీజ్ అదేంటో చెప్పు….” అన్నది.
కాని రాము మాత్రం వెనక్కు తిరిగి అనిత వైపు తిరక్కుండా, “కాని అనితా…..ఈ విషయం నువ్వు తెలుసుకోకుండా ఉండటమే మంచిది….విషయం తెలిస్తే నువ్వు చాలా బాధ పడతావు,” అన్నాడు.
“విషయం తెలియనంత వరకు ఏమీ అనిపించదు రామూ….కాని ఏదో కారణం ఉన్నది అని తెలిసిన తరువాత తెలుసుకోకుండా ఎలా ఉంటాం…ప్లీజ్ రాము…చెప్పు….” అంటూ అనిత బ్రతిమలాడుతున్నట్టు అడిగింది.
రాము మాట్లాడకుండా ఉండే సరికి అనిత ఇక ఆగలేక రాము భుజం మీద చెయ్యి వేసి తన వైపుకి తిప్పుకున్నది.
అలా రాము తన వైపు తిరగగానే అతని మొహంలోకి చూసి అనితకు నోట మాట రాలేదు.
రాము కళ్ళు నీళ్లతో నిండిపోయి….అవి ఎప్పుడు బయటకు దూకుదామా అన్నట్టు ఉన్నాయి.
రాముని అంత బాధలో ఎప్పుడూ చూడకపోయే సరికి అనితకు ఒక్క క్షణం ఏం చేయాలో అర్ధం కాలేదు….కాని ఏదో జరిగిందని మాత్రం అర్ధం అయింది.
అనిత వెంటనే రాముని బెడ్ మీద కూర్చోబెట్టి టవల్‍తో రాము కళ్ళు తుడుస్తూ వాటర్ బాటిల్ తీసుకుని రాముకి తాపించి, “ప్లీజ్ రామూ….చెప్పు…..ఏం జరిగింది…భాస్కర్ ఏం చేసాడు….నిన్ను ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉన్నది…ఎప్పుడూ సరదాగా నవ్వుతూ ఉండే నువ్వు ఇలా బాధ పడటం నాకు ఏదోలా ఉన్నది…” అంటూ ఒక చేతిని రాము వీపు మీద వేసి నిమురుతూ ఇంకో చేతిని రాము మొహం మీద నిమురుతూ అడిగింది.
దాంతో రాము ఒక్కసారిగ్ గట్టిగా గాలి పీల్చుకుని అనిత వైపు చూసి, “జరిగింది మొత్తం చెబుతాను….కాని నువ్వు నీ మొగుడి ముందు ఏమి తెలియనట్టు ఉండాలి….అసలు నేను చెప్పిన విషయం నీకు, నాకు తెలుసని భాస్కర్‍కి తెలియడం నాకు ఇష్టం లేదు…” అన్నాడు.
రాము ఏం చెప్పబోతున్నాడో….ఏ విషయం తన మొగుడి గురించి వినాల్సివస్తుందో అని అనుకుంటూ అలాగే అన్నట్టు అనిత తల ఊపింది.
దాంతో రాము జరిగింది మొత్తం అరగంటపాటు భాస్కర్ తన ఆఫీస్‍లో ఏం చేసింది పూసగుచ్చినట్టు వివరంగా చెప్పాడు.
భాస్కర్ గురించి రాము చెప్పింది విన్న తరువాత అనిత ఇంకా అతను చెప్పింది నమ్మకం కుదరక, “నువ్వు చెప్పింది అంతా నిజమని ఎలా నమ్మడం,” అనడిగింది.
అలా అడగడం వలన ప్రయోజనం లేదని అనితకి కూడా తెలుసు….ఎందుకంటే రాము కళ్లల్లో భాస్కర్ గురించి చెప్పేటప్పుడు నిజం చెబుతున్నాడనే భావం కనిపిస్తున్నది.
మళ్ళి అదే టైంలొ భాస్కర్ మీద విపరీతమైన కోపం కనిపిస్తున్నది.
అనిత అలా అనగానే రాము బెడ్ మీద నుండి లేచి, “నువ్వు అలా అడగడంలో తప్పులేదు వదినా….ఏ భార్యా తన భర్త గురిమ్చి చెడుగా వినాలనుకోదు….కాని నా దగ్గర వాటికి సంబంధించి ఫ్రూఫ్‍లు మొత్తం ఉన్నాయి….అవి చూసిన తరువాత అయినా నమ్ముతావని అనుకుంటున్నాను,” అంటూ వార్డ్‍రోబ్ తలుపు తీసి తన లాప్‍టాప్ తీసుకుని బెడ్ మీద కూర్చుని ఆన్ చేసాడు.
లాప్‍టాప్ ఆన్ అవుతున్నంతసేపు అనిత చాలా ఆత్రంగా దాని వైపు చూస్తున్నది.
భాస్కర్ గురించి రాము చెప్పింది ఇప్పటికీ నమ్మలేకపోతున్నది….కాని రాము అంత నమ్మకంగా ఫ్రూఫ్‍లు ఉన్నాయంటూ లాప్‍టాప్ ఓపెన్ చేసేసరికి ఏం చూపిస్తాడో అన్నట్టు టెన్షన్‍తో చూసున్నది.
లాప్‍టాప్ ఓపెన్ అయిన తరువాత రాము ఒక ఫోల్డర్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఫోటోలు మొత్తం చూపించాడు.
కాని అనిత మాత్రం ఇంకా నమ్మలేనట్టు, “ఈ ఫోటోలు నిజమైనవేనా,” అనడిగింది.
అనిత అలా అనగానే రాము ఒక్కసారి ఆమె వైపు చూసాడు.
రాము చూపులకు తట్టుకోలేక అనిత తల దించుకున్నది.
రాము మళ్ళీ తన లాప్‍టాప్‍లో ఒక వీడియో ఓపెన్ చేసి, “సరె….ఇది చూసైనా నమ్ముతావా,” అన్నాడు.
దాంతో అనిత తల ఎత్తి ఆ వీడియో వైపు చూసింది.
వీడియో చాలా క్లియర్‍గా ఉన్నది….మాటలు కూడా చాలా స్పష్టంగా వినబడుతున్నాయి.
అనిత ఆ వీడియో చూస్తున్నంతసేపూ అందులో ఉన్నది తన మొగుడు భాస్కరేనా అన్న అనుమానంతో చూస్తున్నది ….ఆమె నోటి వెంట మాట పెగలడం లేదు.
అప్పటి దాకా తన మనసులొ భాస్కర్ మీద ఉన్న ప్రేమ కాస్తా రాము చూపించిన వీడియో, ఫోటోలు చూసేసరికి, “ఇలాంటి మనిషితోనా నేను ఇన్నాళ్ళు కాపురం చేసింది,” అని అనుకుంటూ అసహ్యించుకుంటున్నది.
అనితను అలా చూసేసరికి రాము ఆమె భుజం మీద చెయ్యి వేసి, “నువ్వు బాధ పడతావనే ఇన్నాళ్ళు నీకు ఈ విషయం చెప్పలేదు అనితా,” అన్నాడు.
రాము అలా అనగానే అనిత తల తిప్పి అతని వైపు చూస్తూ, “అంటే….భాస్కర్ మీద పగ తీర్చుకోవడానికి నువ్వు నన్ను ట్రాప్ చేసావా,” అనడిగింది.
దానికి రాము అడ్డంగా తల ఊపుతూ, “లేదు అనితా….నాకు ఈ విషయం తెలిసిన తరువాత నీ మీద అలాంటి ఆలోచనే లేదు…ఈ విషయం తెలిసిన తరువాత నేను మా వాళ్ళతో చెప్పి భాస్కర్ గురించి మొత్తం ఎంక్వైరీ చేయించాను…ఇక వీడికి బుధ్ధి చెబుదాం అనుకుంటుండగా అనుకోకుండా యాక్సిడెంట్ అయింది…సరె….వాడి చేసిన పనికి శిక్ష పడిందిలే అనుకుని మెదలకుండా వాడి గురించి పట్టించుకోలేదు….కాని….” అంటూ ఆగాడు.
ఆ ఒక్క క్షణం ఆలస్యం కూడా భరించలేనట్టు రాము వైపు అసహనంగా చూస్తూ, “మరి ఏం జరిగింది,” అనడిగింది అనిత.

“భాస్కర్‍కి నడుము కింద నుండి పెరాలసిస్ వచ్చిందని విన్న తరువాత నేను కూడా సైలెంట్ అయిపోయాను…కాని ఎప్పుడైతే బ్యాంకులో మొత్తం డబ్బులు అయిపోయాయో…అప్పటికే ఈజీ మనీకి అలవాటు పడిపోయిన భాస్కర్ డబ్బు సంపాదించుకునే మార్గాలు వెతుక్కోకుండా ఆ వీడియోలో ఉన్న ఫ్యామిలీకి ఫోన్ చేసి బ్లాక్‍మెయిల్ చేసి డబ్బులు అడిగాడు….దాంతో వీడికి ఇంకా బుధ్ధి రాలేదని అనుకుని ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే నువ్వు గుర్తు కొచ్చావు….అందుకే నిన్ను లొంగదీసుకోవాలని ట్రై చేసాను….” అన్నాదు రాము.
“మరి నీ కోరిక తీర్చుకుని మమ్మల్ని వదిలేయకుండా ఇంట్లో ఉంచుకుని పోషిస్తున్నావెందుకు,” అనడిగింది అనిత.
“మొదట్లొ నిన్ను నా పక్కలో పడుకోబెట్టుకుని నీ మొగుడిని సాధిద్దామనుకున్నా….కాని నువ్వు పరిచయం అయిన తరువాత నీ మంచితనం, అమాయకత్వం చూసి….ఈ విశయాలు నీకు తెలియవని అర్ధం అయింది….దాంతో నా మనసులో నీ మీద సాఫ్ట్ కార్నర్ మొదలయింది….వీడు చేసిన పనికి నిన్ను, నీ పిల్లల్ని బాధపెట్టడం నాకు నచ్చలేదు. అందుకే మీరందరూ నా దగ్గరకు వచ్చేలా మీ ఇంటి ఓనర్‍ చేత మీరు ఇల్లు ఖాళీ చేసేలా చేసాను…తరువాత మీ అందరిని ఇక్కడకు తీసుకొచ్చాను….మా వాళ్ళు మానసికంగా ఎంత బాధపడ్డారో ఆ బాధ భాస్కర్‍కి తెలియాలనే అతనితో ఇలా ప్రవర్తిస్తున్నాను….అతను తన తప్పు తెలుసుకుని పూర్తిగా మారేదాకా ఈ బాధ తప్పదు,” అన్నాడు రాము.
“సరె రామూ….నా మొగుడు మారిపోయి మంచి మనిషిలా వచ్చేలా చేయడానికి నాకు చేతనైనంత హెల్ప్ చేస్తాను,” అంటూ అనిత తన కళ్ల నుంది జారుతున్న కన్నీళ్ళను తుడుచుకున్నది.
“చాలా థాంక్స్ వదినా,” అన్నాడు రాము.
“నువ్వు నాకు థాంక్స్ చెప్పడమేంది రాము….ఎక్కడో రోడ్డున పడాల్సిన మమ్మల్ని ఇక్కడకు తీసుకొచ్చి ఏ లోటు లేకుండా మమ్మల్ని చూసుకుంటున్నావు…నా మొగుడిని మంచి మనిషిని చేసి నాకు అప్పగిస్తానంటున్నావు… అందుకు నేనే నీకు థాంక్స్ చెప్పాలి,” అన్నది అనిత.
“సరె అనితా….కాని ఈ విషయం నీకు, నాకు తెలుసని భాస్కర్‍కి ఇప్పుడే తెలియనివ్వొద్దు….నువ్వు మామూలుగా ఉండు…జరుగుతున్నవి చూసి ఇదంతా తన తప్పుల ఫలితమే అని తెలిసేదాకా భాస్కర్ ఈ బాధ పడాల్సిందే,” అన్నాడు రాము.
రాము అంత గట్టిగా అనడం చూసిన అనిత మనసులో భయపడుతూ, “రామూ…ఇదంతా అడిగానని నా మీద కోపంగా లేదుకదా,” అనడిగింది.