రాములు ఆటోగ్రాఫ్ – Part 9

రాము ఆమె పెదవుల మీద ఒక్కసారి ముద్దు పెట్టి రేణుక ఆమె గదిలోకి వెళ్ళేదాకా ఆగి తన రూమ్ లోకి వెళ్ళి పడుకున్నాడు.
********
రేణుకు తన రూమ్ తలుపు తీసుకుని లోపలికి వచ్చి సునీత వైపు చూసింది.
ఆమె నిద్ర పోతుండటం చూసి రేణుక ఒక్కసారి ప్రశాంతంగా గాలి పీల్చుకుని తలుపు గడి వేసి వచ్చి బెడ్ మీద పడుకున్నది.
రేణుక గదిలోకి వచ్చి బెడ్ మీద పడుకోవడం సునీత కళ్ళు తెరిచి చూసింది….“ఇంత లేటయింది ఏంటి రేణుకా….ఇంత సేపు రాముతో ఏం మాట్లాడుతున్నావు,” అనడిగింది సునీత.

సునీత ఇంకా మేల్కొనే ఉన్నదని తెలియడంతో రేణుకకి ఏం చెప్పాలో తెలియక తడబడుతు పడుకున్నదల్లా లేచి కూర్చున్నది.
సునీత తన బెడ్ మీద నుండి లేచి రేణుక పక్కనే కూర్చుని ఆమె భుజం మీద చెయ్యి వేసి ఆమె మొహం లోకి చూసింది.
అప్పటికే ఆమె వయసు నాలుగు పదులు దాటటంతో ఆమె అనుభవం ఏం జరిగిందో రేణుక మొహం చూడగానే అర్ధమయింది.
సునీత : ఇంత సేపు ఏం చేస్తున్నావు రేణుక….
రేణుక : అది….అది….రాముతో మాట్లాడుతున్నాను….
సునీత : ఇంత సేపా….ఇంత సేపు ఒక పరాయి మగాడి గదిలో ఒక వయసొచ్చిన అమ్మాయి ఉండకూడని తెలియదా….
రేణుక : నాకు రాము అంటే చాలా ఇష్టం…..
సునీత : కాని ఇలా చేయడం తప్పు కదా…..
సునీత దేని గురించి మాట్లాడుతున్నదో రేణుకకి అర్ధమయింది.
ఒక అబ్బాయి గదిలో అమ్మాయి అంతసేపు ఉన్నదంటే ఏం జరిగిందో తెలుసుకోలేని తెలివితక్కువది కాదు సునీత.
సునీత : నీకు అంత ఇష్టంగా ఉంటే రాము విషయం మీ అమ్మ, నాన్నతో మాట్లాడాలి….అంతే కాని ఇలా చేయకూడదు…
రేణుక : అది కాదు సునీత….ఈ ప్రేతాత్మ నుండి ఎలా తప్పించుకుంటామో తెలియదు….పైగా రాము ఈ కాలం వాడు కాదని గట్టిగా చెబుతున్నాడు….దాంతో నాకు ఎప్పుడు ఏం జరుగుతుందో….రాము నా నుండి దూరమైపోతాడేమో అన్న భయంతో ఒక్క రోజైనా రాముకి భార్యగా లేకపోతే ప్రియురాలిగా ఉండాలనుకున్నాను….అందుకే ఇంత ధైర్యం చేసాను….
సునీత : ఒకవేళ రాము చెప్పింది నిజం అయ్యి అతను వెళ్ళిపోతే ఏం చేస్తావు….అది ఆలోచించావా….
రేణుక : చెప్పా కదా సునీత….ఒక్క రోజు రాముతో సంతోషంగా ఉన్నా….వాటిని తలుచుకుంటూ జీవితాంతం గడిపేస్తాను….
సునీత కి ఇక ఏం చెప్పాలో అర్ధం కాలేదు….రేణుక అంత పెద్ద స్టెప్ తీసుకున్న తరువాత ఇక ఆలోచించడానికి ఏమీ లేనట్టు…
సునీత : సరె….ఈ ప్రాబ్లం నుండి బయట పడిన తరువాత రాము గురించి ఆలోచిద్దాం….పడుకో….మళ్ళీ పొద్దున్నే వెళ్ళాలి….
రేణుక సరె అంటూ పడుకున్నది….అప్పటి దాకా శరీరం సుఖంతో అలిసిపోవడంతో వెంటనే నిద్ర పట్టేసింది.
కాని సునీత మాత్రం రేణుక వైపు చూస్తూ అలాగే ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నది.
*******
హోటల్ లో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు.
రిసిప్షన్ లో ఉన్న అతను కూడా ఇక తన రూమ్ కి వెళ్లి పడుకున్నాడు.
టైం ఉదయం (అర్ధరాత్రి) మూడు గంటలయింది….హోటల్ రిసిప్షన్ లో ఉన్న ఫోన్ మోగడం మొదలయింది.
కాని అక్కడ ఎవరూ లేకపోవడంతో ఫోన్ అలా ఆగకుండా మోగుతూనే ఉన్నది.
రాత్రి అయ్యేసరికి బాగా నిశబ్దంగా ఉండటంతో ఆ ఫోన్ శబ్దం హోటల్ అంతా వినిపిస్తున్నది.
కాని ఎవరికీ మెలుకువ అనేది రావడం లేదు.
రూమ్ లో ఆలోచనలతో కళ్ళు మూసుకుని పడుకుని ఉన్న సునీత కి ఆ ఫోన్ శబ్దం వినిపించడంతో కళ్ళు తెరిచి చుట్టూ చూసింది.