రియా – part 3

14.టార్చర్

“చెయ్యి వదులూ…..”అంది కోపంగా రియా….

ఇంకా గట్టిగా పట్టుకున్నాడు విక్రాంత్…..”చెయ్యి వదులు అభి….”అని గట్టిగా అరిచేసరికి….”ఓహ్ నా పేరు కూడా గుర్తుందా నీకు…నా పేరు తో పాటు….నా వల్ల కష్టంగా అలవాటైన జాగింగ్ గుర్తుంది…..నన్ను రాత్రంతా నీ హాస్టల్ బాల్కని లోంచి చూడాలని గుర్తుంది…నేను ఇన్ని రోజుల తర్వాత కనిపించిన వెంటనే ఏడ్వాలనీ గుర్తుంది……..నేను నీ ముందుకొస్తే అరవాలని నా నుంచి పారిపోవాలని కూడా గుర్తుంది కానీ నా ప్రేమ మాత్రం నీకు గుర్తులేదు కదా…?బాగుంది రియా….చాలా బాగుంది…..బై….”అని మరో మాట కి తావివ్వకుండా అక్కడ నుంచి వచ్చేశాడు అభి అలియాస్ విక్రాంత్ అభిమన్యు….

అభి వెళ్ళిన వైపే చూస్తుండిపోయింది రియా…..

ఆ రోజు ఆఫీసులో……

వర్క్ చేసి కొన్ని సిగ్నేచర్స్ కోసం విజయ్ దగ్గరికి వెళ్ళింది రియా…..

“హో మిస్ రియా….సిగ్నేచర్ డిపార్ట్మెంట్ నాది కాదు మన ఆఫీస్ కి కొత్తగా వచ్చారు కదా విక్రాంత్…తనది….”అని విజయ్ చెప్పేసరికి ఇబ్బంది గా విక్రాంత్ అభిమన్యు క్యాబిన్ వైపు కదిలింది రియా

“మే ఐ కం ఇన్ సార్…”అంది రియా

“హా…”అని అన్నాడు విక్కి